ప్రపంచ వ్యాప్తం గా ఉన్న మన సామాజిక వర్గం లోని ప్రతి ఒక్కరిని ఒకే తాటిపైకి తీసుకురావటానికి ఒక మహోన్నతమైన సంకల్పం రూపం దాల్చితే ఆవిర్భవించిన మహా ప్రస్థానం మన ఈ కాప్స్ రాక్స్… 15 మందితో వడి వడి గా మొదలైన ఈ ప్రయాణం నేడు ఒక మహా వృక్షంలా విశ్వ వ్యాప్తంగా నాలుగు దిక్కులా విస్తరించి ఎన్నో లక్షల కుటుంబాలకు నీడనిస్తుంది అనుటలో ఎటువంటి అతిశయోక్తి లేదు.

కాపులలోని ఐకమత్య లేమిని పదే పదే విమర్శించే వారి విమర్శలకు ధీటుగా సమాధానం చెప్తున్న ఒకే ఒక్క ఆయుధం మన కాప్స్ రాక్స్.
కాపులలోని నిజమైన ఐక్యతను వెలికితీసి నలుమూలలా అంతరించిపోతున్న అనుభంధాలను అక్కున చేర్చుకుని పలకరిస్తున్న మాతృ మూర్తి మన కాప్స్ రాక్స్.. 

కాప్స్ రాక్స్ యొక్క అవిర్భావం నుండీ నేటీ వరకు!!
మారుతున్న టెక్నాలజీ కి అనుగుణంగా అంచలంచెలుగా విస్తరిస్తూ

 1. వాట్స్ ఆప్ గ్రూప్ లో 30 మందితో మొదలై ఈరోజు 600 లకు పైగా వాట్స్ ఆప్ గ్రూప్స్
 2. ప్రస్తుతం అక్షరాల ఐదులక్ష నలభై వేల మంది సభ్యులతో ఫేస్ బుక్ సైన్యం
 3. ప్రతి రోజు మనవారి నిత్య అవసరాలకి అనుగుణంగా ప్రతి విభాగం లో దానికి సంభం దించిన గ్రూప్స్ క్రియేట్ చేసి దాని ద్వారా సేవలు చేస్తూ ప్రయణం ప్రారంభించాము.

ఉదాహరణకి:

పైన పొందుపరచిన వివిధ విభాగాల వివరణ…

ప్రపంచ వ్యాప్తం గా ఉన్న మన సామాజిక వర్గం లోని ప్రతి ఒక్కరిని ఒకే తాటిపైకి తీసుకురావటానికి ఒక మహోన్నతమైన సంకల్పం రూపం దాల్చితే ఆవిర్భవించిన మహా ప్రస్థానం మన ఈ కాప్స్ రాక్స్… 15 మందితో వడి వడి గా మొదలైన ఈ ప్రయాణం నేడు ఒక మహా వృక్షంలా విశ్వ వ్యాప్తంగా నాలుగు దిక్కులా విస్తరించి ఎన్నో లక్షల కుటుంబాలకు నీడనిస్తుంది అనుటలో ఎటువంటి అతిశయోక్తి లేదు. కాపులలోని ఐకమత్య లేమిని పదే పదే విమర్శించే వారి విమర్శలకు ధీటుగా సమాధానం చెప్తున్న ఒకే ఒక్క ఆయుధం మన కాప్స్ రాక్స్.

కాపులలోని నిజమైన ఐక్యతను వెలికితీసి నలుమూలలా అంతరించిపోతున్న అనుభంధాలను అక్కున చేర్చుకుని పలకరిస్తున్న మాతృ మూర్తి మన కాప్స్ రాక్స్..

కాప్స్ రాక్స్ యొక్క అవిర్భావం నుండీ నేటీ వరకు!!

మారుతున్న టెక్నాలజీ కి అనుగుణంగా అంచలంచెలుగా విస్తరిస్తూ

ప్రపంచం నలుమూలలో ఏ మూలకి వెళ్ళినా ముఖపరిచయం లేకున్నా మేము ఉన్నాము అంటూ పోటీలు పడి మన కాప్స్ రాక్స్ సైన్యం మనకి సాదర స్వాగతం పలుకుతున్నారు అంటే అతిశయోక్తి కాదేమో.

అంతే కాకుండా వారు చూపించే ప్రేమానురాగాలు , వారు చేసే అతిధి సత్కారాలు చూసి ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బు అవ్వటం మనవంతు అయ్యేలా చేసిన ఘనత మన ఈ కాప్స్ రాక్స్ ది.

ఇవి ఏదో గొప్ప కోసం గొప్పగా చెప్తున్న మాట లు కానే కాదు కళ్ళ ముందు జరుగుతున్న నగ్న సత్యాలు….

భవిష్యత్తు లో చేయవలసినవి:

 • సంఘంలో ఒకరికి ఒకరు సహాయం చేసుకుంటూ మర్యాద పూర్వకం గా మసులుకోవటం.
 • కాప్స్ రాక్స్ ను మండల మరియు గ్రామీణ ప్రాంతాలలో విస్తరింప చేయటం
 • మన గ్రూప్స్ లో లేని వారిని ఫేస్ బుక్ మరియు వాట్స్ ఆప్ గ్రూపు లలో యాడ్ చేయటం.
 • మన సామాజిక వర్గానికి సంబందించిన,మీకు తెలిసిన వివిధ విభాగాలలో ప్రొఫెషనల్స్ ని గుర్తించి మన కాప్స్ రాక్స్ గురించి వివరించి సభ్యులుగా చేయుట.
 • కొత్త సభ్యులను చేర్చేటప్పుడు కాప్స్ రాక్స్ విలువలు,నియమాలు అర్ధమయ్యేలా వివరించి అంగీకరించిన పిదప చేర్చుకోవటం. గ్రూప్ నుంచి ఎవరైనా నిష్క్రమిస్తే , వెంటనే గ్రూప్ మెంబెర్ కి తెలియపరచటం. ఎవరినైనా గ్రూప్ నుంచి తొలగించవలసి వస్తే అడ్మిన్స్ సూచనమేరకు నడుచుకోవటం

చేయకూడనివి:

 • గ్రూప్ నియమలను అతిక్రమించటం
 • ఇతర సామాజిక వర్గాల వారిని విమర్శించటం
 • రాజకీయములపై వాదించటం
 • వ్యక్తిగత మరియు అనవసరపు పొస్ట్స్ పెట్టటం
 • ఇక్కడ పోస్ట్ చేసిన జాబ్స్ మరియు ఇతర సమాచారం ని బయటకి షేర్ చేయటము.
 • మన గ్రూపులో మహిళలని ఇబ్బంది పరచటం.
 • గ్రూప్ సభ్యులతో మరియు గ్రూప్ అడ్మిన్స్ తో వాదించటం

#note: #నేను #సైతం #అర్ధం: సంస్థ లో ప్రతి ఒక్కరూ నేనుసైతం అని కాప్స్ రాక్స్ కి సైనికులు. ఒక సభ్యుడిని చేర్చినా, ఒక గ్రూప్ నిర్మిచినా కాప్స్ రాక్స్ కి అంకితం. నిర్మించిన గ్రూప్ ఏ ఒక్కరికి సొంతం కాదు, గ్రూప్ లో ప్రతి ఒక్కరి బాద్యత. #imp #Note:ఇక్కడ పని చేసే వారు అందరూ మన సామాజిక వర్గం మీద వున్న అభిమానం తో స్వచ్చందం గా చేస్తున్నారు తప్పితే ఏమి ఆశించి కాదు…..!!